శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (15:42 IST)

శనివారం ఉప్పును దానంగా ఇవ్వొచ్చట..(Video)

శనివారం పూట హనుమంతుడిని పూజించడం ద్వారా శని గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. 51 లేదా 21 శనివారాలు ఉపవాసం వుండి కిచిడీ, నల్లటి మినుములతో చేసిన వంటకాలను తీసుకుంటే శని నుంచి ఏర్పడే బాధల నుంచి విముక్తి పొంద

ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. ||
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ || అంటూ శని గాయత్రీ మంత్రాన్ని శనివారం పూట 11 సార్లు ఉచ్చరించినట్లైతే శనిదోష ప్రభావం తగ్గుముఖం పడుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అలాగే శనివారం పూట హనుమంతుడిని పూజించడం ద్వారా శని గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు.
 
51 లేదా 21 శనివారాలు ఉపవాసం వుండి కిచిడీ, నల్లటి మినుములతో చేసిన వంటకాలను తీసుకుంటే శని నుంచి ఏర్పడే బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే సప్తముఖ రుద్రాక్షలతో కూడిన మాలను ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి. శనివారం పూట నలుపు నువ్వులను దానం చేయాలి. శని యంత్రంతో కూడిన పెండెంట్‌ను ధరించడం ద్వారా ఈతిబాధలను తొలగించుకోవచ్చు. మహామృత్యుంజయ మంత్రంతో మహాదేవుడిని పూజించడం ద్వారా శనిగ్రహ దోషాలు హరించుకుపోతాయి.
 
కానీ శనివారం పూట కొత్త వస్తువులను కొనకుండా వుంటే మంచిది. చెక్కతో చేసిన ఫర్నిచర్లను, వాహనాలను శనివారం కొనకూడదు. ఆవాలను శనివారం వంటల్లో ఉపయోగించకూడదు. పేదలకు చేతనైన అన్నదానం చేయొచ్చు. ఆవ‌నూనెను శ‌నివారం పూట శ‌ని విగ్ర‌హానికి అభిషేకం చేయించాలి. దీంతో శ‌ని సంతృప్తి చెంది మంచి ఫ‌లితాల‌ను ప్రసాదిస్తాడు. నలుపు రంగు దుస్తులను శనివారం పూట వేసుకోకపోవడం మంచిది కాదు. అలా వేసుకుంటే ఇబ్బందులు, సమస్యలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మినప వంటకాలను శనివారం పూట పేదలకు దానం చేయడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. కానీ మినపప్పు కొనడం మాత్రం శనివారం చేయకూడదు. 
 
శనివారం పూట ఉప్పును ఎవరికైనా దానం ఇవ్వొచ్చు. ఉప్పును శనివారం కాకుండా మిగిలిన వారాల్లో దానం చేయడం నిషిద్ధం. కానీ శనివారం ఉప్పును దానం చేయడం ద్వారా ఈతిబాధలు, ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు. కానీ శనివారం ఉప్పును మాత్రం కొన‌కూడ‌దు. కొంటే ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ఇదేవిధంగా వంకాయ‌లు, న‌ల్ల మిరియాల‌ను శ‌నివారం రోజున కొనకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కొంటే మాత్రం శనితో సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు, సంపదలు తగ్గుముఖం పట్టడం వంటివి తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.