గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (13:29 IST)

మరో బ్యాంకు స్కామ్ : పంజాబ్ సీఎం అల్లుడుపై సీబీఐ కేసు

మరో బ్యాంకు స్కామ్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు గురుపాల్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.109 కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో ఆయనపై సీబీఐ

మరో బ్యాంకు స్కామ్ వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు గురుపాల్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.109 కోట్ల రూపాయల మోసం చేసిన కేసులో ఆయనపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. బ్యాంకును మోసం చేసిన సింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌ కేసులోని 11 మందిలో సీఎం అల్లుడు గురుపాల్ సింగ్ ఒకరు. ఆయన కంపెనీకి డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. 
 
దేశంలోని అతిపెద్ద షుగర్‌ కంపెనీల్లో పంజాబ్‌కు చెందిన సింభోలి షుగర్స్‌ లిమిటెడ్‌ ఒకటి. దీనికి గుర్మిత్‌ సింగ్‌ మాన్‌ ఛైర్మన్‌. 2011లో ఈ కంపెనీ చెరకు రైతులకు ఫైనాన్స్‌ చేసేందుకు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ నుంచి రూ.148.60 కోట్ల అప్పు తీసుకుంది. ఈ మొత్తాన్ని రైతులకు అందజేయకుండా కంపెనీ తన అవసరాలకు వాడుకుంది. దీంతో రూ.97.85కోట్లు మొండిబకాయిగా మారింది. మార్చి 2015లో తప్పును గుర్తించినట్లు బ్యాంక్‌ ప్రకటించింది. 2015 మేలో మొండి బకాయిల జాబితాలో చేర్చింది.