Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వారిని వదిలిపెట్టొద్దు... ప్రభుత్వం అప్పీల్ చేయాలి : సుబ్రమణ్య స్వామి

గురువారం, 21 డిశెంబరు 2017 (13:14 IST)

Widgets Magazine
subramanya swamy

2జీ స్కామ్‌లో డీఎంకే నేతలు ఏ.రాజా, కనిమొళిలను నిర్దోషులుగా ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు విడుదల చేయడాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి తీవ్రంగా ఆక్షేపించారు. ఈ కేసు తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేయాలని ఆయన కోరారు. సరైన ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం తక్షణం హైకోర్టులో అప్పీల్ చేయాలని కోరారు. 
 
కాగా, గత యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కామ్‌పై తొలుత పిటీషన్ దాఖలు చేసింది సుబ్రమణ్య స్వామినే. ఈయన దాఖలు చేసిన పిల్‌ ఆధారంగా 2జీ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు 14 మందినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీనిపై  తీవ్రంగా స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి… ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటీషన్ దాఖలు చేయాలని సూచించారు. 
 
కాగా, ఈ తీర్పుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వాలి. 2జీతో పాటు పలు కుంభకోణాల్లో యూపీఏ ప్రభుత్వం కూరుకుపోయిందనే తప్పుడు ప్రచారంతోనే మోడీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ కోర్టు తీర్పుతో అసలు విషయం ఏమిటో అందరికీ తెలిసింది. 2జీ అనేది విపక్షానికి చెందిన అబద్ధాలతో కూడిన స్కాం అనేది రుజువైందని అభిప్రాయపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అయోధ్యలో రామాలయం ఏర్పాటు ఆ ఇద్దరి వల్లే సాధ్యం: స్వరూపానంద

అయోధ్యలో రామాలయ వివాదంపై ద్వారక శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి బృందావనంలో ...

news

#2GScamVerdict టైమ్‌లైన్... రాజా - కనిమొళి నిర్దోషులు

గత యూపీఏ - 2 ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపిన 2జీ స్కామ్‌లో ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు ...

news

అమ్మ చనిపోతే.. ఇంటి ఓనర్ ఏం చేశాడో తెలుసా?

అనారోగ్యంతో బాధపడుతూ అమ్మ మరణిస్తే.. ఆమె సంతానానికి ఇంటి ఓనర్ షాకిచ్చాడు. తల్లి ...

news

2జీ స్కామ్‌ కొట్టివేత : వారందరూ నిర్దోషులే.. కోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో గురువారం కోర్టు తీర్పు ...

Widgets Magazine