శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (11:01 IST)

2జీ స్కామ్‌ కొట్టివేత : వారందరూ నిర్దోషులే.. కోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర టెలికంశాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో గురువారం కోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర టెలికంశాఖ మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులుగా ఉన్నారు. వీరందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ఓపీ సైనీ సంచలన తీర్పునిచ్చారు. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని పేర్కొంటూ ఈ కేసును కూడా న్యాయమూర్తి కొట్టివేశారు. 
 
గురువారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. దీంతో కోర్టుతో పాటు.. పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు.. టెలికాం మాజీ మంత్రి ఏ.రాజాలు తీహార్ జైలులో కొద్దిరోజులు జైలుశిక్ష కూడా అనుభవించారు. కాగా, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే.