Widgets Magazine

వచ్చే ఏడాది ఎన్నికలు.. రైల్వేలో 89,500ల నియామకాలు

రైల్వేలో ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు రానుండటంతో వ్యూహాత్మకంగా ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో హైస్కూల్ విద్యార్హత నుంచి ఇంజనీరింగ్ వ

indian railway
selvi| Last Updated: సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:07 IST)
రైల్వేలో ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు రానుండటంతో వ్యూహాత్మకంగా ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో హైస్కూల్ విద్యార్హత నుంచి ఇంజనీరింగ్ విద్యార్హతల వరకు వివిధ వర్గాల వారికి ఏకంగా లక్షలాది ఉద్యోగాలను భారతీయ రైల్వే కల్పించనుంది.

2016-17 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ ఉద్యోగుల వేతనాలకు రూ.69,713 కోట్లు ఖర్చు చేసింది. అది 2017-18లో రూ.72,705 కోట్లకు చేరుకోనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ రూ.76,451 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే 89,900 మంది సిబ్బంది నియామకంపై దృష్టి సారించింది. భద్రతా విభాగంలోనే భారీగా ఖాళీలున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. రైల్వేలో సుమారు 1.2 లక్షల ఉద్యోగ ఖాళీలు భద్రతా విభాగంలోనే వున్నాయి. ప్రతి ఏడాది రైల్వేలో సుమారు 40,000-45,000 మంది రిటైర్ అవుతున్నట్లు సమాచారం. తాజా నియామకాలతో రైల్వేపై ఏటా రూ.4వేల కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :