గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (18:20 IST)

ప్లీజ్.. నా కుమార్తెను మళ్లీ మళ్లీ చంపుతున్నారు... చూడలేకపోతున్నా...

కన్నకూతురి చావు వీడియోని మళ్లీ మళ్లీ చూడలేక ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సోషల్ మీడియా కంపెనీలు తన కూతురి చావు వీడియోని డబ్బు సంపాదించడం కోసం ఉపయోగించుకుంటున్నాయని వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్‌లో పోస్ట్ చేసి క్లిక్‌ల కోసం దానిని ఉపయోగించుకోవడం సమంజసం కాదంటున్నాడు. దీని గురించి గూగుల్ సంస్థకు రిపోర్ట్ చేసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయాడు. దానిని ప్రచారం చేసే పలు సోషల్ మీడియాలను కూడా ఆయన విమర్శలు గుప్పించారు.  
 
వివరాల్లోకి వెళితే వర్జీనియాకు చెందిన ఆండీ అనే వ్యక్తి కూతురు జర్నలిస్టుగా పనిచేసేది. 2015లో పర్యాటక రంగానికి సంబంధించి ఓ ఇంటర్వ్యు చేయడానికి వెళ్లింది. అక్కడ అలిసన్ పార్కర్ చేసిన కాల్పులలో ఆండీ కూతురు చనిపోయింది. తనతోపాటు వెళ్లిన కెమెరామెన్‌ని కూడా అతను దారుణంగా కాల్చి చంపాడు. అంతేకాకుండా దాన్నంతా వీడియోని తీసి తానుకూడా కాల్చుకుని చనిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశారు. దీని గురించి ఆండీ గూగుల్ సంస్థకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ వీడియోని తాను మళ్లీ మళ్లీ చూడలేనని వెంటనే దానిని తీసివేయాలని కూడా అభ్యర్థించారు. కానీ గూగుల్ మాత్రం దానిని పట్టించుకోలేదు. మీరు ఆ వీడియోని ఎక్కడైనా చూస్తే చెప్పండి, వెంటనే తొలగిస్తాం అంటూ సమాధానమిచ్చింది. 
 
వీడియోని ఒకసారి చూసినందుకే తట్టుకోలేని తాను మళ్లీ ఎలా చూడగలనని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలలో ఉన్న తన కూతురి చావుకు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని, మీడియాకు ఉన్న నిబంధనలే సోషల్ మీడియాకు కూడా వర్తింపజేయాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై జార్జ్‌టన్ యూనివర్శిటీ సివిల్ రైట్స్ క్లినిక్‌తో కలిసి ఆయన పోరాటం చేస్తున్నారు.