గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (12:06 IST)

పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా!

పాకిస్థాన్‌ పాపం ఇరకాటంలో పడింది... ఏదో సాయం చేసేస్తారని ఆశించిన డ్రాగన్ సహాయం అందించకపోవడంతో ఇప్పటికే సగం చచ్చిన పాక్‌కి ఈసారి ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. దీనికి గల కారణాలను విశ్లేసిస్తే... భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతూ పుల్వామా దాడికి కారణమైన జైషే మహ్మద్ సహా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలన్నిటికీ తక్షణమే చెక్ పెట్టాలంటూ ఆస్ట్రేలియా హుకుం జారీచేసింది. 
 
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ నెల 14 జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'పాకిస్తాన్ తనకు తానుగా నిషేధించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ను నిర్మూలించేందుకు సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేయాలి. లష్కరే తొయిబా మూకలను కూడా తుదముట్టించాలి. పాక్ గడ్డపై కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఇకపై చట్టపరంగా, భౌతికంగా ఏమాత్రం చోటివ్వకూడదు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించి, వివాదాలు పరిష్కరించుకునేందుకు ఇదొక్కటే మార్గం' అని పేర్కొన్నారు. 
 
ఇరుదేశాల మధ్య శాంతికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు దిగరాదని భారత్, పాకిస్తాన్‌లను ఆస్ట్రేలియా కోరింది. చర్చల ప్రక్రియ ద్వారా వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని పేర్కొంది. మరి పాక్ పరిస్థితి ఏమిటో... వారి సమాధానం ఏమిటో... వేచి చూడాల్సిందే.