అల్ ఫ్రాకేన్‌ను మించిపోయిన డోనాల్డ్ ట్రంప్ : బిల్ బ్లాడ్ విన్

శనివారం, 25 నవంబరు 2017 (09:41 IST)

Billy Baldwin

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మరో లైంగిక ఆరోపణ వచ్చింది. ఇపుడు చేసింది హాలీవుడ్ నటుడు బిల్ బ్లాడ్ విన్. ఇది హాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఒంటరిగా ఉన్న తన భార్యను గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడంటూ ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. ఇది వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు తాను, తన భార్య కలిసి వెళ్లినట్టు చెప్పాడు. అపుడు ఒక హోటల్‌లో ట్రంప్ తన భార్య చెన్యా ఫిలిప్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బిల్ ఆరోపించాడు. ఒంటరిగా ఆమెను గదిలోకి పిలిచిన ట్రంప్ ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మహిళలను లైంగికంగా వేధించడంలో హాలీవుడ్ నిర్మాత అల్ ఫ్రాకేన్‌‌ను ట్రంప్ మించిపోయాడన్నారు. 
 
తన భార్యను లైంగికంగా వేధించడమేకాకుండా ఆమెను బలవంతంగా తన హెలికాప్టర్‌లో ఎక్కించుకుని వెళ్లేందుకు ట్రంప్ ప్రయత్నించాడని ఆరోపించాడు. అల్ ఫ్రాకేన్ కంటే ట్రంప్ 5 రెట్లు ఎక్కువగా మహిళలను లైంగికంగా వేధిస్తాడని బిల్ బ్లాక్ విన్ తెలిపాడు. గత కొంతకాలంగా హాలీవుడ్‌లో లైంగిక వేధింపులపై సోషల్ మీడియా మాధ్యమంగా పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన తన భార్యపై జరిగిన వేధింపులను వెల్లడించడం ఇపుడు సంచలనంగా మారింది. 
 
 
 దీనిపై మరింత చదవండి :  
Hollywood Donald Trump Sexual History Billy Baldwin

Loading comments ...

తెలుగు వార్తలు

news

ముంబైలో దారుణం : లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై టీవీ నటుడు రేప్

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై బుల్లితెర నటుడు ...

news

భార్యను స్నేహితులతో గ్యాంగ్‌రేప్ చేయించిన భర్త.. ఎక్కడ?

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ దారుణం జరిగింది. తన భార్యను ఓ కిరాతక భర్త తన స్నేహితులతో ...

news

బాంబు పేల్చి చంపారు, తప్పించుకుని పారిపోతుంటే కాల్చారు... 235 మందిని...

ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో ప్రార్థనలతో రద్దీగా వున్న ఓ మసీదుపై ఉగ్రవాదులు ...

news

ట్రంప్ కూతురు ఇవాంకా ఆ రోడ్డుపై వస్తే బావుండన్న సింగర్ సునీత

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. అదే ఇవాంకా ట్రంప్ పైన. ఇప్పటికే ఇవాంకా ట్రంప్ ...