బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (12:29 IST)

బర్డ్‌ఫ్లూతో ధ్రువపు ఎలుగుబంటి మృతి.. రెడ్ లిస్టులో..?

Polar Bear
Polar Bear
ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్‌ఫ్లూతో ఓ ధ్రువపు ఎలుగుబంటి మృతి చెందింది. గత నెల డిసెంబరులో ఇది ఉత్కియాగ్విక్‌లో మృతి చెంది కనిపించింది. ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల కళేబరాల నుంచి దానికి బర్డ్ ఫ్లూ సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. 
 
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేటివ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్‌లిస్ట్‌లో ధ్రువపు ఎలుగుబంట్లు అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉన్నాయి. 
 
వాతావరణ మార్పుల కారణంగా మంచు వేగంగా కరిగిపోతుండడంతో ఐయూసీఎన్ వీటిని అంతరించిపోయే జంతువుల జాబితాలో చేర్చింది. 
 
కాగా, హెచ్5ఎన్1 వైరస్ కారణంగా మరిన్ని ధ్రువపు ఎలుగుబంట్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పశువైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.