Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రైతుల్లా నటిస్తున్నారు.. వాళ్లే టార్గెట్.. పాక్ సరిహద్దుల్లో "ఆపరేషన్ అర్జున్"

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (11:44 IST)

Widgets Magazine

పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు బీఎస్ఎఫ్ సరికొత్త ఆపరేషన్ ప్రారంభించింది. దీనికి కోడ్ నేమ్ ఆపరేషన్ అర్జున్. భారత జవాన్లను హతమార్చేందుకు స్నిప్పర్లను వాడుతూ, సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులతో విరుచుకుపడుతూ, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న పాక్ వైఖరికి చెక్ పెట్టే దిశగా ఆపరేషన్ అర్జున్ అనే పేరిట కొత్త ఆపరేషన్‌ను చేపట్టనుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా సరిహద్దులకు దగ్గరగా పాకిస్థాన్ వైపు నివాసాలు ఏర్పరచుకున్న రిటైర్డ్ సైనికులు, ఐఎస్ఐ, పాక్ రేంజర్ల నివాసాలు, వారి భూములను టార్గెట్ చేయనుంది. 
 
గతంలో సరిహద్దుల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వహించి, ఆపై పదవీ విరమణ చేసిన సైనికులకు అక్కడికి దగ్గర్లోనే భూములు, ఇళ్లు ఇస్తున్న పాక్ ప్రభుత్వం వారి సేవలను మరో రకంగా వినియోగించుకుంటోంది. వారిచ్చే సమాచారంతోనే యువ టెర్రరిస్టులు సులభంగా భారత్‌లోకి చొచ్చుకు వస్తున్న  పరిస్థితి నెలకొందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
పొలాల్లో పని చేస్తున్న రైతుల్లా నటిస్తూ, భారత్ వైపు జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించే వీరు, ఆ సమాచారాన్ని సైనికాధికారులతో పంచుకుంటున్నారు. వీరిని నిలువరించేందుకు భారత ప్రభుత్వం అర్జున అస్త్రాన్ని బయటికి తీసింది. 
 
ఇందులో భాగంగా సరిహద్దుల్లో నివాసాలు ఏర్పరుచుకుంటున్న వారు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లోని రిటైర్డ్ ఆఫీసర్ల నివాసాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను వెనక్కి తీసుకోవాలంటే.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ విరమించుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజకీయనేత నిజాయితీగా ఉంటే ఎన్నో కష్టాలు : రాహుల్ గాంధీ

'నిజాయితీగల రాజకీయ నేతగా ఉండటమే భారత్‌లో అత్యంత కష్టమైన పని. నిజాయితీ ఉంటే ఎన్నో ...

news

రెడీ.. వన్.. టు.. త్రీ... కిమ్‌పై సైనిక చర్యకు సిద్ధం : డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గర్జించారు. ప్రపంచ దేశాలను ధిక్కరిస్తున్న ఉత్తర ...

news

భక్తురాలి సాయంతో యువతిపై కీచక బాబా అత్యాచారం...

మహిళా భక్తురాలి సహాయంతో ఓ కీచక బాబా మరో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒకటి తాజాగా ...

news

నమ్మించి.. ఆపై వంచించి.. రేప్ ఘటన వెలుగులోకి ఇలా..

నెల్లూరు జిల్లా కనిగిరిలో ఓ బీఎస్సీ విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు జరిపిన అత్యాచార ...

Widgets Magazine