Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ బయోపిక్‌కు జేడీ నిర్మాత కాదు: అర్జున్ రెడ్డిలా... రామ్ గోపాల్ రెడ్డి..?

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (14:07 IST)

Widgets Magazine

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అలనాటి నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' అనే టైటిల్ ఖరారు చేశాడు. వైకాపా నేత లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ సంబంధాలపై ఈ స్టోరీ నడుస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వార్తలొచ్చాయి. దీనిపై వర్మ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. జె.డి చక్రవర్తి ''లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
 
మరోవైపు అర్జున్ రెడ్డి సినిమా తరహాలో రామ్ గోపాల్ వర్మ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు సంపాదించిన విజయ్ దేవర కొండ తాజా ట్వీట్‌లో ఆర్‌జీఆర్‌ (రామ్ గోపాల్ రెడ్డి) ను ప‌రిచ‌యం చేస్తున్నానంటూ ఓ ఫొటో పోస్ట్ చేశాడు.

ఆ ఫొటోలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోలా రామ్‌గోపాల్ వ‌ర్మ గ‌డ్డం మీసాల‌తో ఉన్నాడు. దీంతో పాటు ఈయన రామ్ గోపాల్ వర్మ కాదని రామ్ గోపాల్ రెడ్డి అంటూ పోస్ట్ చేశాడు. ''రామ్ గోపాల్ రెడ్డికి హాయ్ చెప్పండి'' అని విజ‌య్ దేవ‌రకొండ పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు విభిన్నాభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సెక్సీ సుందరి రాయ్ లక్ష్మీ ఫోటో గ్యాలెరీ (Julie 2 Teaser Trailer)

సౌత్ గ్లామర్ సెన్సేషన్ రాయ్ లక్ష్మీ అలియాస్ లక్ష్మీ రాయ్ 'జూలీ 2' సినిమా ద్వారా ...

news

షారూఖ్‌పై కంగనా ఫైర్.. 15ఏళ్ల అమ్మాయిలతో చిందులేస్తారు.. ఆదిత్య నోటీసులు..

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌పై పడింది. కంగనా వ్యాఖ్యలు ప్రస్తుతం ...

news

పాత పేరు కలిసిరాలేదంటున్న 'జయం' హీరోయిన్

నితిన్ హీరోగా వచ్చిన చిత్రం 'జయం'. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ...

news

చైనాలో బాహుబలి-2 రిలీజ్: హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతుందా?

చైనాలో బాహుబలి-2 విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల ...

Widgets Magazine