Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజమౌళితో నా సినిమా వుంటుంది... స్పైడర్ హీరో మహేష్ బాబు

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:21 IST)

Widgets Magazine

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు స్పైడర్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈనెల 27వ తేదీన రిలీజ్ కానున్న స్పైడర్ మూవీకి సంబంధించి టిక్కెట్ల బుకింగ్స్ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సినిమా బాహుబలి కలెక్షన్లను బ్రేక్ చేస్తుందని టాక్ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడాడు. ''స్పైడర్'' సినిమాను మురుగదాస్ అద్భుతంగా తెరకెక్కించారని మహేశ్ బాబు చెప్పుకొచ్చాడు. మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. 
 
అలాగే బాహుబలి మేకర్ రాజమౌళితో సినిమా చేయనున్నట్లు వస్తున్న వార్తలపై కూడా మహేష్ బాబు స్పందించారు. రాజమౌళితో కలిసి తాను సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆయనకి కమిట్ మెంట్స్ వున్నాయని... తనకు కూడా కొన్ని కాల్షీట్స్ వుండటంతో కొంత టైమ్ తీసుకున్నాక ఈ సినిమాను కలిసి చేస్తామని చెప్పుకొచ్చాడు.
 
ఇకపోతే.. రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా 2018లో ప్రారంభమై 2019లో రిలీజ్ అవుతుందని.. అంతకుముందు కొరటాలతో భరత్ అనే నేను, మహేష్ 25 (త్రివిక్రమ్‌తో) సినిమాలను ప్రిన్స్ పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని వంటి హీరోలతో కలిసి పనిచేసిన రాజమౌళి త్వరలో తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి పనిచేయనున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఆస్కార్' కంటే తనకు అదే ఎక్కువ అంటున్న దర్శకుడు రాజమౌళి

ఆస్కార్ అవార్డు అంటే హాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పిచ్చ క్రేజ్. ఆ అవార్డు వస్తే దాన్ని ...

news

రంగస్థలం 1985లో కరీనా కపూర్ స్టెప్పులు.. పవన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్?

మగధీర... రామ్ చరణ్ తాజా సినిమా రంగస్థలం 1985. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ...

news

బిగ్ బాస్ ఓవర్.. నాతోనే డ్యాన్స్ రెడీ: ఉదయ భానుతో రేణు సెల్ఫీ (ప్రోమో వీడియో)

బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన నేపథ్యంలో త్వరలోనే స్టార్ మా ఛానల్‌లో ''నాతోనే డ్యాన్స్''అనే ...

news

హనీప్రీత్‌కు అసూయ.. గుర్మీత్ నన్ను పెళ్లి చేసుకుంటే.. సవతి అవుతానని భయపడేది: రాఖీ

బాలీవుడ్ సెక్సీబాంబ్ రాఖీ సావంత్ తాజాగా డేరా బాబా బయోపిక్‌లో హనీప్రీత్ సింగ్ పాత్రలో ...

Widgets Magazine