మహాభారతం నా కల మాత్రమే.. సినిమా తీస్తానని చెప్పలేదు: రాజమౌళి

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (14:31 IST)

బాహుబలి దర్శకుడు జక్కన్న మహాభారతంపై సంచలన కామెంట్ చేశారు. త్వరలో రాజమౌళి మహాభారతం సినిమాను తెరకెక్కిస్తారని అందరూ అనుకుంటున్న వేళ... మలయాళంలో మోహన్ లాల్ భీమసేనుని కథా నేపథ్యంలో సాగే మహాభారతంలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో తన మహాభారత కథను తెరకెక్కించే విషయాన్ని రాజమౌళి పక్కనబెట్టేశాడు. మలయాళంలో రూపొందుతున్న మహాభారతంలో అగ్ర నటులు నటించనున్న తరుణంలో.. ప్రస్తుతానికి ఆ మహా ప్రాజెక్టును పక్కనబెట్టేయాలనే ఆలోచనకు వచ్చాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
 
ఈ వార్తలను నిజం చేసేలా మహాభారతం సినిమా తన కల అని చెప్పానే కానీ ఆ కథ ఆధారంగా సినిమాను తీస్తున్నానని మాత్రం చెప్పలేదని రాజమౌళి అన్నారు. ప్రస్తుతం 'బాహుబలి 2' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నానని... ఇప్పటికిప్పుడు ఏ సినిమాను మొదలుపెట్టలేదన్నారు. త్వరలో తన తదుపరి ప్రాజెక్టు ప్రారంభమవుతుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. 
 
''మహాభారతం'' సినిమాను రాజమౌళి తీస్తాడని గతంలో ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపిన నేపథ్యంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ, మహాభారతం సినిమాను తీయట్లేదన్నారు. బాహుబలికి తర్వాత తాను మహాభారతం సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ట్విట్టర్‌లో కొట్టుకుంటున్న అంజలి, ఆమె చెల్లలు ఆరాధ్య

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేమ్ అంజలి మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి ఆమె తన ...

news

''జిమ్మిక్కీ క‌మ్మాల్'' పాటకు మోహన్ లాల్ స్టెప్స్-వీడియో చూడండి

మలయాళ నటుడు మోహన్ లాల్ జిమిక్కీ కమ్మాల్ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను ఓనమ్ ...

news

రాజకీయాల్లోకి కమల్‌ హాసన్.. తండ్రికి తోడుగా అక్షరహాసన్...

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ టాప్ హీరోయిన్‌గా మంచి మార్కులేసుకుంది. ...

news

హీరో మహేష్ బాబు రాజకీయ ప్రవేశం ఖాయమా?.. వారిద్దరూ అంతే...

హీరో మహేష్ బాబు రాజకీయ ప్రవేశం చేయడం ఖాయమా? అవుననే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. తమిళ ...