ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (12:39 IST)

శ్రీలంక నుంచి చైనాకు లక్ష కోతుల ఎగుమతి.. ఎందుకబ్బా?

monkey
శ్రీలంక నుంచి చైనాకు భారీగా కోతులను ఎగుమతి చేయనున్నారు. టోక్ మకాక్ రకం కోతులు శ్రీలంకలో దాదాపు 30 లక్షలకు పైగా కోతులు ఉన్నాయి. ఆ జాతి కోతుల్లో లక్ష కోతులను చైనాకు ఎగుమతి చేయనున్నారు. ఈ జాతి కోతులు ఒక్క శ్రీలంకలోనే కనిపిస్తుంటాయి. ఇపుడు ఈ జాతి మనుగడ అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ జాతి కోతులను తమకు పంపిచాలంటూ చైనా కోరింది. 
 
దీంతో టోక్ మకాక్ కోతులను తమకు పంపించాలని చైనా చేసిన ప్రతిపాదనను అధ్యయనం చేయాలంటూ శ్రీలంక వ్యవసాయ శాఖామంత్రి మహింద అమరవీర అధికారులకు సూచించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. టోక్ మకాక్ జాతి కోతులు శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఇవి అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. 
 
చైనాలోని వెయ్యి జంతు ప్రదర్శనశాలకుగాను చైనా లక్ష కోతులను కోరిందని మహిందా అమరవీర తెలిపారు. తమ దేశంలో ఈ కోతుల సంఖ్య అధికంగా ఉన్నందున డ్రాగన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఆయన తెలిపినట్టు తెలుస్తుంది. కోతుల ఎగుమతి విషయంలో న్యాయపరమైన చిక్కులేమైనా తలెత్తుతాయా? అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి క్యాబినెట్ అనుమతితో ఓ కమిటీని నియమించాలని నిర్ణయించారు.