బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (14:07 IST)

అమెరికా-రష్యాల మధ్య అత్యంత భయానక యుద్ధం సంభవించవచ్చు: టినే

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చినే గ్లోబల్ బిజినెస్ సదస్సు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిక్ చినే ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గ్లోబల్ బిజినెస్ సదస్సులో

అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చినే గ్లోబల్ బిజినెస్ సదస్సు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డిక్ చినే ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. గ్లోబల్ బిజినెస్ సదస్సులో చినే మాట్లాడుతూ.. జాతీయ భద్రతకు రష్యా అమెరికాకు పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భయానక యుద్ధం అమెరికా-రష్యా మధ్య సంభవించవచ్చునని టినే ఆందోళన వ్యక్తం చేశారు. 
 
సైబర్ వార్ ద్వారా అమెరికన్ ఎన్నికలను ప్రభావితం చేయాలనుకుంటున్న పుతిన్ చర్య యుద్దానికి రెచ్చగొట్టడం లాంటిదేనని డిక్ చినే చెప్పుకొచ్చారు. ఒబామా సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం అణుపరీక్షలకు తక్కువ నిధులు కేటాయించడంతో భద్రత విషయంలో అమెరికా బలహీనంగా తయారైందని, ఇదే సమయంలో అమెరికా వ్యతిరేక శక్తులు తమ బలాన్ని పెంచుకున్నాయని చినే వ్యాఖ్యానించారు. 
 
అమెరికాపై రష్యా చేసే ఈ దాడిలో విమానాలు, బాక్స్ కట్టర్‌ల కన్నా శక్తివంతమైన సామాగ్రిని ఉపయోగిస్తారని భావిస్తున్నట్లు టినే చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందంటూ వస్తున్న కథనాలపై చినే ఆందోళన వ్యక్తం చేశారు. నాటో దళాలను బలహీనపరిచేందుకు పుతిన్ కుట్ర పన్నుతున్నారని, ఇప్పటికే సిరియా, ఇరాన్‌లలో రష్యా తిష్ట వేసిందని టినే చెప్పుకొచ్చారు.