ఇండియాకు భారత్ పేరు.. చైనా ఏమంటుందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చబోతోందన్న వార్తలపై దేశంలోని ప్రతిపక్షాలు మండిపడుతుండగా.. పొరుగు దేశం చైనా కూడా దాదాపు భారత్ వ్యతిరేక వైఖరినే ప్రదర్శించినట్లు కనిపిస్తోంది.
అంతర్జాతీయంగా తన ఖ్యాతిని పెంచుకునేందుకు జీ20 సదస్సును భారత్ ఒక అవకాశంగా పరిగణిస్తోంది. అయితే, పేరు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించింది. భారతదేశం 1947కి ముందు నాటి నీడ ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా సంస్కరించగలదా? అన్నది కీలకం.
విప్లవాత్మక సంస్కరణలు లేకుండా భారతదేశం విప్లవాత్మక అభివృద్ధిని చూడలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెరుగుతున్న అంతర్జాతీయ ప్రాముఖ్యతను భారత్ తన వృద్ధి చోదకంగా ఉపయోగించుకోగలదని ఆశాజనకంగా ఉంది.
"అంతర్జాతీయ సమాజం దృష్టి రాబోయే G20 సదస్సుపై కేంద్రీకృతమై ఉన్న తరుణంలో, న్యూఢిల్లీ ప్రపంచానికి ఏమి చెప్పదలుచుకుంది?" అని చైనా ప్రశ్నిస్తోంది. పేరు మార్చడం వలస పాలన నీడను చెరిపేయడమేనని చైనా భావిస్తోంది.