గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (18:39 IST)

భారత్‌పై చైనా బెలూన్ల నిఘా.. అమెరికా మీడియా రిపోర్ట్

india vs china
భారత్‌పై పెత్తనం చెలాయించేందుకు చైనా సాయశక్తులా ప్రయత్నిస్తోంది. తాజాగా ఇండియాపై కూడా చైనా బెలూన్ల నిఘా పెట్టింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. 
 
దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్టిందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం అమెరికా గగనతలంలో ఎగురుతున్న చైనా బెలూన్‌ను ఆదేశం పేల్చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో తమ మిత్రదేశాలకు అగ్రరాజ్యం అమెరికా కొన్ని రహస్య అంశాలను తెలియజేసింది. ఇందులో చైనా నిఘా బెలూన్ అనేక సంవ‌త్స‌రాల పాటు హైన‌న్ ప్రావిన్సులో ఆప‌రేష‌న్‌లో వుందని పేర్కొంది. 
 
జ‌పాన్‌, ఇండియా, వియ‌త్నాం, తైవాన్‌, పిలిప్పీన్స్‌లో ఉన్న వ్యూహాత్మ‌క కీల‌క ప్రాంతాల‌ను ఆ బెలూన్లు టార్గెట్ చేసిన‌ట్లు ద వాషింగ్ట‌న్ పోస్టు వెల్లడించింది.