శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మే 2021 (16:00 IST)

జూమ్ యాప్‌లో నగ్నంగా కనిపించిన కెనడా ఎంపీ.. డ్రెస్ మార్చుకుంటుండగా..?

కరోనా కారణంగా జూమ్ యాప్ వినియోగం ఎక్కువైన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది వ్యక్తిగత జీవితాలు ఆన్ లైన్‌లో దర్శనమిస్తున్నాయి. తాజాగా కెనడాకు చెందిన ఎంపీ నగ్నంగా వీడియోలో దర్శనమిచ్చాడు. కెనడా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. తర్వాత సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాడు. క్యూబెక్స్ ప్రావిన్స్‌కు చెందిన లిబరల్ పార్టీ ఎంపీ విలియం ఆమోస్ ఈ చర్యకు పాల్పడ్డాడు. 
 
జాగింగ్‌కి వెళ్లి వచ్చిన తాను డ్రెస్ మార్చుకుంటుండగా.. పొరపాటున కెమెరా ఆన్ అయ్యిందని వివరణ ఇచ్చుకున్నాడు విలియం. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో సమావేశాలకు దూరంగా ఉంటానని ట్వీట్ చేశాడు. అయితే విలియం ఇలా జూమ్‌లో కనిపించడం ఇదే తొలిసారికాదు. గతంలోనూ కనిపించి విమర్శల పాలయ్యాడు.