12-17 ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సిన్.. మోడెర్నా సక్సెస్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించింది. జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది. వయో బేధం లేకుండా కరోనా బారిన పడిన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ కారణంగా పిల్లల్లో కరోనా సంక్రమణ అధికంగా వుండే అవకాశం వుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో.. కోవిడ్ నుంచి పిల్లలను కాపాడేందుకు వ్యాక్సిన్ సిద్ధం చేసేందుకు పలు కంపెనీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. అందులో ఒకటే అమెరికాకు చెందిన మోడెర్నా.
18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ వచ్చేసిన తరుణంలో.. తదుపరి చర్యగా 12 సంవత్సరాలకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంపై మోడెర్నా పరిశోధన చేపట్టింది. ఇందుకు అమెరికా, కెనడా దేశాలు అనుమతి ఇచ్చాయి.
ఈ నేపథ్యంలో అమెరికాలో 12 నుంచి 17 సంవత్సరాల లోపు గల 3,700 మందిపై జరిపిన తొలి విడత వ్యాక్సిన్ పరిశోధన విజయవంతం అయినట్లు మోడెర్నా సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌కు త్వరలో అమెరిరా సర్కారు ఆమోద ముద్ర వేసే అవకాశం వుందని తెలుస్తోంది.