శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (13:29 IST)

చనిపోయిన మహిళ 117 రోజులకు ఆడ శిశువుకు జన్మనిచ్చింది.. ఎలా?

ఆ గర్భవతి బిడ్డకు జన్మనివ్వక ముందే చనిపోయింది. కానీ చనిపోయిన 117 రోజులకు ఆమెకు బిడ్డ జన్మించింది. ఈ ఘటన యూరప్‌లో చోటుచేసుకుంది. కాన్పు సమయంలో ఆ మహిళ చనిపోలేదని.. ముందే ప్రాణాలు కోల్పోయిందని.. వైద్య చరిత్రలో ఇది అరుదైన ఘటన అని యూరప్ వైద్యులు చెప్తున్నారు. తల్లి మరణించినా.. బిడ్డ బతికిందని వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యూరప్‌లోని జెఖియాలో 28 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్‌కు గురైంది. అప్పటికే గర్భవతి అయిన ఆమెను డాక్టర్లు 117 రోజులుగా ఆక్సిజన్ మాస్క్‌లో ఉంచి ప్రాణం నిలిపారు. ఇలా కృత్రిమ శ్వాసలో ఉండే ఆమె బిడ్డను ప్రసవించింది. ఇది చరిత్రలోనే అత్యంత అరుదైగ ఘటన.
 
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆ యువతి తీవ్ర అనారోగ్యం పాలై బ్రెయిన్ స్ట్రోక్ కు గురైంది. వెంటనే ఆమెను ఎయిర్ ఆంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల ఆమె ప్రాణం కాపాడలేమని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. కానీ అప్పటికే ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెను బతికించుకోలేక పోయినా బిడ్డను బతికించుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. 
 
ఎలాగైనా బిడ్డను కాపాడమని డాక్టర్లను కోరారు. తల్లి బ్రెయిన్ డెడ్ అయినా.. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో ఆమెను ప్రత్యేకంగా ఓ గదిలో ఉంచి వైద్యులు చికిత్స చేశారు. సిజేరియన్ ద్వారా వైద్యులు బిడ్డకు ప్రాణం పోశారు. కృత్రిమ శ్వాస ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు ప్రసవం చేయించినట్లు వైద్యులు చెప్పారు. డెలివరీ పూర్తి కాగానే డాక్టర్లు ఆ యువతికి లైఫ్ సపోర్ట్ తీసేశారు. ఆ బిడ్డను తండ్రికి అప్పగించారు.