మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (09:04 IST)

చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయింది.. ఎక్కడ... ఎలా?

కాలుష్య రహిత వాహనాల తయారీలో భాగంగా, ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ కార్లు, వాహనాల తయారీపై అధిక దృష్టిసారించారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి.

కాలుష్య రహిత వాహనాల తయారీలో భాగంగా, ఇటీవలికాలంలో ఎలక్ట్రిక్ కార్లు, వాహనాల తయారీపై అధిక దృష్టిసారించారు. ఇందులోభాగంగా, ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్రవాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, తాజాగా చార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారంతా తృటిలో ప్రాణగండం నుంచి బయటపడ్డారు. చైనాలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఓ వ్యక్తి, తన కూతురు, వాళ్ల పెట్ డాగ్ ఇంట్లోని హాలులో ఉన్నాడు. ఆ సమయంలో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తి చార్జింగ్ తీసేశాడు. అయినా పొగలు ఎక్కువవడంతో అప్పటికే పెట్ డాగ్ భయపడి బయటికి వెళ్లిపోగా.. ఆ వ్యక్తి తన కూతురును తీసుకొని ఇంట్లోని పడకగదిలోకి దౌడుతీశాడు. 
 
అంతే.. క్షణాల్లో ఆ స్కూటర్ పేలిపోయింది. ఈ ఘటన ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.