బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (18:02 IST)

కరోనాతో కోమాకు వెళ్లిన ఐదు నెలల బాలుడు కోలుకున్నాడు

Brazil boy
బ్రెజిల్‌లో అద్భుతం జరిగింది. కరోనా సోకిన ఐదు నెలల బాలుడు కోలుకున్నాడు. ఇంకా గత నెల రోజులుగా కోమాలో వున్న ఆ బాలుడు సురక్షితం బయటపడ్డాడు. డామ్ తల్లిదండ్రులు ఆ బాలుడిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. 
 
అయితే అక్కడి తీసుకెళ్లడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని డామ్ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం తన కుమారుడు కోలుకోవడంతో తమ ఆనందానికి అవధుల్లేవని హర్షం వ్యక్తం చేశారు. 
 
32 రోజుల పాటు డామ్ వెంటిలేటర్‌పైనే వున్నాడని.. కరోనా వైరస్ తమ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు సోకి వుంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ బిడ్డ కోలుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు.