శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (12:55 IST)

బీఫ్ ఆరగించాకే భారత్‌‍కు రావాలంటున్న కేంద్ర మంత్రి

భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే విదేశీ పర్యాటకులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఒక విజ్ఞప్తి చేశారు. పశుమాంసం (బీఫ్)ను తమతమ దేశాల్లో ఆరగించి భారత్‌లో అడుగుపెట్టాలంటూ స

భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం వచ్చే విదేశీ పర్యాటకులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఒక విజ్ఞప్తి చేశారు. పశుమాంసం (బీఫ్)ను తమతమ దేశాల్లో ఆరగించి భారత్‌లో అడుగుపెట్టాలంటూ సూచించారు. 
 
భువనేశ్వర్ లో నిర్వహిస్తున్న 33వ ఇండియన్‌ టూరిస్ట్‌ అసోషియేషన్‌ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఫ్ నిషేధంపై పలు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనిపై లోతుగా చర్చ సాగుతోందన్నారు.
 
అదేసమయంలో కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో తాను ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో పశుమాంస విక్రయాలపై నిషేధం ఉందన్నారు. అందువల్ల బీఫ్ నిషేధం చాలా సున్నితమైన అంశంగా పేర్కొంటున్నట్టు తెలిపారు.