ఛీ.. ఇదేం పాడుపనీ.. ట్రంప్ ‌పోస్టర్‌పై మూత్రంపోశాడు...

మెక్సికన్-అమెరికన్ కమెడీయన్ జార్జిలోఫేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 57 యేళ్ళ లోఫేజ్.. ఏ పని చేసినా అది చర్చనీయాంశం కావాల్సిందే. తద్వారా ఆయన విమర్శలపాలుకావడమే కాకుండా, బోలెడంత పబ్లిసిటీ కూడా

George Lopez
pnr| Last Updated: శుక్రవారం, 13 జులై 2018 (14:30 IST)
మెక్సికన్-అమెరికన్ కమెడీయన్ జార్జిలోఫేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 57 యేళ్ళ లోఫేజ్.. ఏ పని చేసినా అది చర్చనీయాంశం కావాల్సిందే. తద్వారా ఆయన విమర్శలపాలుకావడమే కాకుండా, బోలెడంత పబ్లిసిటీ కూడా వస్తుంది. తాజాగా మరో వివాదాస్పద పని చేశాడు.
 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ విధానాన్ని అనేక సెలెబ్రిటీలు కూడా తమ నిరసన తెలుపుతున్నారు. 
 
అలాంటివారిలో జార్జి లోఫేజ్ ఒకరు. ఈయన తన నిరసన తెలిపే క్రమంలో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ అనే షాపింగ్ మాల్‌లో బహిరంగంగా అందరి ముందు మూత్ర విసర్జన చేశాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతే.. ఇది వైరల్ అయింది. 
 
ఆ వీడియోలో జార్జిలోఫేజ్.. డొనాల్డ్ ట్రంప్ అని రాసి ఉన్న ప్లేస్‌లో చేశాడు. లోఫేజ్ ఇదంతా చేస్తున్న సమయంలో చుట్టూ ఉన్నవారంతా నవ్వుతూ కనిపించారు. అయితే వీడియోలో అతడు పోసింది నిజమైన మూత్రం మాత్రం కాదు. ట్రంప్ పేరుపై మూత్రం పోసేందుకు ఓ వాటర్ బాటిల్‌ను ఉపయోగించాడు. 
 
గతంలో కూడా ఓ ఛారిటీ ఈవెంట్‌లో ఇలానే విచిత్రంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచాడు లోఫేజ్. లోఫేజ్ వ్యవహారశైలిపై అమెరికన్లు భగ్గుమన్నారు. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బహిరంగంగా అందరి ముందూ పాడుపని చేసిన లోఫేజ్‌ను లోపలేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో దిగివచ్చిన షాపింగ్ మాల్‌లో చేసిన ఈ పాడుపనిపై దిగివచ్చిన లోఫేజ్ ఆ తర్వాత సారీ చెప్పాడు. దీనిపై మరింత చదవండి :