Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ హీరోకు గోమూత్రంతో నిరసన .. ఎవరు?

గురువారం, 18 జనవరి 2018 (09:41 IST)

Widgets Magazine
prakash  raj

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఓ చిన్నపాటి అలజడి నెలకొంది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే వారిని లక్ష్యంగా చేసుకుని వివిధ రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. ఈ కోవలో అనేక మంది సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఆ కోవలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. 
 
ఈయనకు బీజేపీ అనుబంధ సంస్థ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. కర్ణాటకలోని సిర్సాలో జరిగిన ఓ కార్యక్రమంలో అతను పాల్గొన్న చోటును గోమూత్రంతో బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు శుద్ధి చేశారు. ఈ ఘటన సంక్రాంతి రోజున జరిగింది. 
 
"మన రాజ్యాంగం, మన గొప్పతనం" అనే కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు ప్రకాశ్ రాజ్‌ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్... కర్ణాటక ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత స్థానిక బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు అక్కడికి వచ్చి స్టేజ్ మొత్తాన్ని గోమూత్రంతో శుద్ధి చేయడం విశేషం. దీనిపై ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో స్పందించారు. మరి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఇలాగే గోమూత్రంతో శుద్ధి చేస్తారా అంటూ ప్రకాశ్‌రాజ్ సెటైర్ వేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేడు అన్నగారి వర్థంతి.. నెక్లెస్ రోడ్డుకు క్యూ కట్టిన హీరోలు

మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతిని ఆయన అభిమానులు ...

news

కత్తి మహేశ్ అమ్మాయిలకు అసభ్య సందేశాలు పంపేవాడు... రేపు చూడండి... నిర్మాత సంచలనం

కత్తి మహేష్ పైన సినీ నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణల చేయడం సంచలనం రేపుతోంది. ఇటీవలి కాలంలో ...

news

రూ.20లక్షల పన్ను ఎగ్గొట్టిన అమలా పాల్: బెయిల్ మంజూరు చేసిన కోర్టు

అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ ...

news

సొంత ఊరిలో కత్తి మహేష్‌ను చితకబాదిన పవన్ ఫ్యాన్స్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్‌లలో పవన్ ...

Widgets Magazine