Widgets Magazine

చికెన్, మందు ఇచ్చేవారికే పేదలు ఓట్లేస్తారు: ప్రకాష్ రాజ్‌భర్

బీజేపీ మంత్రుల నోటి దురుసు కాస్త ఎక్కువేనన్న విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించినా.. నోటికి మాత్రం కొందరు బీజేపీ నేతలు కళ్లెం వేయరు.

Chicken
selvi| Last Updated: సోమవారం, 25 డిశెంబరు 2017 (16:33 IST)
బీజేపీ మంత్రుల నోటి దురుసు కాస్త ఎక్కువేనన్న విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించినా.. నోటికి మాత్రం కొందరు బీజేపీ నేతలు కళ్లెం వేయరు. సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ.. వార్తల్లోకెక్కుతారు. తాజాగా యూపీకి చెందిన బీజేపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ సోమవారం బలరాంపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మద్యం, మాంసం ఇస్తే పేదలు ఎవ్వరికైనా ఓట్లేస్తారంటూ ప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా పేదలు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో మంచి చేస్తామన్న వారికి ఓట్లు వేయకుండా చికెన్, మందు ఇచ్చేవారికే పేదలు ఓట్లస్తున్నారని ప్రకాష్ తెలిపారు.

చివరికి గెలిచాక మరో ఎన్నికల వరకు రాజకీయ నేతలు వారిని పేదలుగానే చూస్తారని ఆరోపించారు. మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న ప్రకాష్ పేదలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది.

మరోవైపు రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గోవులను అక్రమ రవాణా చేసేవారికి, గో మాంసం తినేవారికి చావే గతి అని, ఆవులను చంపితే.. మీరు కూడా చస్తారు అంటూ హెచ్చరించారు.


దీనిపై మరింత చదవండి :