శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (12:23 IST)

పిల్లలకు హనీ రోస్టెడ్ చికెన్, హనీ టోస్ట్ తినిపిస్తే?

పిల్లల ఆరోగ్యానికి తేనె ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే పిల్లలు తాగే పాలలో పంచదారకు బదులు తేనెను చేర్చుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలకు ఇచ్చే అల్పాహారంలో తేనెను చేర్చడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచవచ్చ

పిల్లల ఆరోగ్యానికి తేనె ఎంతగానో మేలు చేస్తుంది. అందుకే పిల్లలు తాగే పాలలో పంచదారకు బదులు తేనెను చేర్చుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలకు ఇచ్చే అల్పాహారంలో తేనెను చేర్చడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచవచ్చు. అందుకే తేనెతో బ్రెడ్ ముక్కలను టోస్ట్‌ చేసి పిల్లలకు ఇవ్వడం మంచిది.

రెండు బ్రెడ్ ముక్కలను తీసుకొని బ్రెడ్‌కు ఇరువైపులా తేనెను రాసి.. దానికి పావు స్పూన్ మేర పీ నట్ బటర్ కూడా రాసి.. పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లో వుంచినట్లైతే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే అల్పాహారంగా హనీ టోస్ట్ ఇవ్వొచ్చు.
 
అలాగే రోజూ పిల్లలు తినే బ్రేక్ ఫాస్ట్‌లో పండ్ల ముక్కలతో సలాడ్ రెడీ చేయండి. తాజా పండ్ల ముక్కలకు ఫ్యాట్ తొలగించిన పెరుగుతో పాటూ తేనె కూడా కలపండి. వీటితో పాటుగా తేనెను తృణధాన్యాలను కూడా కలిపి సర్వ్ చేయొచ్చు. రోజూ తినే సలాడ్‌ కంటే తేనె కలిపిన సలాడ్స్ తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.  
 
ఇంకా శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు ఆవాల పొడి, సోయాసాస్, నిమ్మరసం చేర్చి చికెన్ ముక్కలకు పట్టించండి. చివరిగా తేనెను కూడా చికెన్ ముక్కలకు పట్టించి గంట పాటు అలాగే వుంచి రోస్ట్ చేసి పిల్లలకు ఇస్తే ఇష్టపడి లొట్టలేసుకుని తింటారు.