గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (15:01 IST)

రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లో వస్తా: ప్రకాష్ రాజ్ ప్రకటన

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం ఫ్యాషనైపోయింది. నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ బరిలో వున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలంటే

సినీ తారలు రాజకీయాల్లోకి రావడం ఫ్యాషనైపోయింది. నిన్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ బరిలో వున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలంటే తనకు ఏమాత్రం ఆసక్తి లేదని.. అవి చాలా కష్టమని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. కానీ ఊరకే రెచ్చగొడితే మాత్రం రాజకీయాల్లో వస్తానని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించాడు. 
 
ఆదివారం బెంగళూరులో ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూరు నుంచి 2017 సంవత్సరానికి గాను ''ఉత్తమ వ్యక్తి'' అవార్డు అందుకున్న అనంతరం ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడాడు. బెంగళూరును బెందకాళూరు అని కూడా పిలుస్తారని, శాంతికి భంగం కలిగించి అశాంతి సృష్టించాలనుకునే వారి వ్యాఖ్యలు ఇక్కడ సాగవని హెచ్చరించారు. 
 
బెంగళూరులో ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య తర్వాత రాజకీయాలపై కడిగేయడం మొదలెట్టిన ప్రకాశ్ రాజ్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆ ఘటన తర్వాత కూడా బీజేపీ మతానికి ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడ్డారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెబుతూనే.. ''ఈ విజయంతో మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా?" అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు. 
 
ఇంకా బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డేపై  ప్రకాశ్ రాజ్ ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని హెగ్డే ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. నేషనలిజం, హిందుత్వం ఒక్కటేనని చెబుతున్న మంత్రిగారు ఆమాటకు అర్థం కూడా వివరిస్తే బాగుంటుందన్నారు. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని ఈయనగారు భావిస్తున్నారేమోనంటూ అనంతకుమార్‌ మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. ఆపైనే అసలు విమర్శలతో ఓ పోస్టును ప్రకాశ్‌ ఉంచారు. ఈ ట్వీట్స్ ఇటీవల వైరల్ అయ్యాయి.