గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (19:37 IST)

స్పెయిన్‌లో భారీ వర్షాలు.. కార్లు కొట్టుకుపోయాయి..

Spain
Spain
స్పెయిన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. స్పెయిన్ ఈశాన్య ప్రాంతంలోని జరాగోజా నగరంలోనూ వరద బీభత్సం నెలకొంది. తాజాగా స్పెయిన్‌లో వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
తాజాగా, ఓ రహదారిని వరద ముంచెత్తగా, కార్లు సైతం వెనక్కి కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కార్లలోని వారు నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిని ఆ వీడియోలో చూడొచ్చు. 
 
రోడ్డుపైకి దూసుకొచ్చిన వరద నీరు కార్లను ఆటబొమ్మల్లా నెట్టుకుంటూ వెళుతుండగా, ప్రజల కార్ల టాప్ పైకి చేరుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.