సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (18:07 IST)

కూచిపూడి డ్యాన్సర్ అమర్‌నాథ్ ఘోష్ హత్య.. ఫోరెన్సిక్ ఆధారంగా?

Amarnath
Amarnath
అమెరికాలో భారతీయ కూచిపూడి నాట్యకారుడి హత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ విచారణ ప్రారంభమైంది. సెయింట్ లూయిస్‌లో అమర్‌నాథ్ ఘోష్ అనే కూచిపూడి డ్యాన్సర్ కాల్చి చంపబడ్డాడు. 
 
మిసౌరీలోని స్టలూయిస్‌లో మరణించిన అమర్‌నాథ్ ఘోష్ కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి. తాము ఫోరెన్సిక్‌ విచారణను జరుపుతున్నామని చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు విచారణకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నామని స్పష్టం చేసింది.
 
కాగా, ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ అమర్‌నాథ్ ఘోషన్‌ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మిసౌరిలో ఈ హత్య జరిగింది. ఈవినింగ్ వాక్‌కి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు  ఆయనపై దాడి చేసి గన్‌తో షూట్ చేశారు. అక్కడికక్కడే కుప్పుకూలి మృతి చెందాడు.