ఆ తాబేలుకి 186 ఏళ్లు... కానీ శృంగారంలో ప్రతిరోజూ చాలా దృఢంగా....

తాబేలు ఆయుర్దాయం 200 ఏళ్లకు పైగా వుంటుందని చెపుతుంటారు. అనుకున్నట్లే ఓ తాబేలుకి 186 సంవత్సరాలు వచ్చాయి. ఐతే ఏంటటా అనుకుంటాం కదా. కానీ ఆ తాబేలు 186 ఏళ్లు నిండినా శృంగార సామర్థ్యం మాత్రం తగ్గనేలేదట. ఈ విషయాన్ని దాని జీవన విధానాన్ని చాలా దగ్గరగా పరిశీలి

Tortoise
ivr| Last Modified సోమవారం, 14 మే 2018 (12:16 IST)
తాబేలు ఆయుర్దాయం 200 ఏళ్లకు పైగా వుంటుందని చెపుతుంటారు. అనుకున్నట్లే ఓ తాబేలుకి 186 సంవత్సరాలు వచ్చాయి. ప్రపంచంలోనే పెద్ద వయసు కలిగిన తాబేలు కూడా అదే. ఐతే ఏంటటా అనుకుంటాం కదా. కానీ ఆ తాబేలు 186 ఏళ్లు నిండినా శృంగార సామర్థ్యం మాత్రం తగ్గనేలేదట. ఈ విషయాన్ని దాని జీవన విధానాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తున్న నిపుణులు గుర్తించారు. 
 
వివరాలను పరిశీలిస్తే... అట్లాంటిక్ మహాసముద్రంలోని తాబేళ్లపై పరిశోధనలు చేసే బృందానికి ఓ తాబేలుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎందుకంటే దాని వయసు 186 ఏళ్లు. ఐతే అంత వయసు వచ్చినా దాని శృంగార సామర్థ్యం తగ్గకపోవడం. అంతేకాదు... దానికి కంటి చూపు కూడా మందగించిందట. ఐతే సూర్యాస్తమయం కాగానే శృంగారంలో పాల్గోవడం చేస్తుందట. ఈ విషయాన్ని అధ్యయన బృందంలోని సభ్యురాలు తెలియజేశారు. ఈ తాబేలు 1832 సంవత్సరంలో జన్మించిందట.దీనిపై మరింత చదవండి :