Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐఎస్ లిస్టులో...బ్రిటన్ బుల్లి రాజు జార్జ్.. చంపేస్తామంటూ బెదిరింపులు..

సోమవారం, 30 అక్టోబరు 2017 (10:58 IST)

Widgets Magazine

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఐఎస్ ఉగ్రవాదులు.. బ్రిటన్ కాబోయే రాజుపై కన్నేశారు. ఐఎస్ జాబితాలో బ్రిటన్ బుల్లి రాజు జార్జ్ పేరు చేరింది. ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్టన్‌ల నాలుగేళ్ల కుమారుడైన జార్జ్‌ను హత్య చేస్తామంటూ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. బ్రిటన్ కాబోయే రాజు చదివే స్కూలుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
 
సెంట్రల్ లండన్‌లోని థామస్ బాటెర్‌సీ స్కూల్లో చదువుతున్న జార్జ్ ఫొటోతో సహా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఉగ్రవాదులు అతడిని చంపేస్తామని హెచ్చరించారు. అరబిక్ భాషలో రాసిన ఈ పోస్టులో యుద్ధమనేది వస్తే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని వుంది. టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవడం, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియకపోవడంతో ఉగ్రవాదులు ఈ ప్లాట్‌ఫాంనే ఎంచుకుంటున్నారు. 
 
ఇకపోతే లండన్ తూర్పు వైపున ఉన్న 110 మైళ్ల దూరంలోని నార్‌ఫోల్క్ వెస్టాక్రె మాంటిస్సోరి స్కూల్‌లో యువరాజును క్రిస్మస్ పండుగ సందర్భంగా చేర్పించారు. అప్పట్లో రాజ దంపతులు తమ ఇద్దరి పిల్లలతో తీసిన ఓ ఫొటో విడుదల చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేడు ఢిల్లీకి రేవంత్.. రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ సభ్యత్వం

తెలంగాణ ఫైర్ బ్రాడ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఇందుకోసం ఆయన ...

news

సెక్యూరిటీ గార్డు సాహసం... ప్రాణాలకు తెగించి (వీడియో)

గోవా రాజధాని పనాజీలో ఓ సెక్యూరిటీ గార్డు తన ప్రాణాలకు తెగించి మరీ ఏటీఎం సెంటర్‌లో ...

news

పీకలదాకా తాగిన యువతి పోలీసులకు చెప్పు చూపించింది (వీడియో)

ఈ మధ్య పురుషులకు సమానంగా మహిళలు మందు కొట్టడం ఫ్యాషనైపోయింది. మద్యం సేవించి వాహనాలు నడపడం ...

news

హైదరాబాద్ నడిబొడ్డున.. బుద్ధుడి సాక్షిగా నిర్ణయం తీసుకుంటా : రేవంత్

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో తీవ్ర మానసికక్షోభకు గురి చేశాయనీ ...

Widgets Magazine