Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పది సూట్‌కేసుల్లో 23 గన్స్‌ను హోటల్‌కు చేరవేసిన పెడ్డాక్

బుధవారం, 4 అక్టోబరు 2017 (16:52 IST)

Widgets Magazine
Stephen Paddock

అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నరమేధానికి పాల్పడిన స్టీఫెన్ పెడ్డాక్‌ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈయన క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడలేదనీ, పక్కా ముందస్తు ప్లాన్‌తో మరణ మృదంగం సృష్టించాడనీ లాస్ వెగాస్ పోలీసులు చెపుతున్నారు. అన్నికంటే ముఖ్యంగా ఈ దారుణానికి పాల్పడే ముందు పెడ్డాక్ పది లక్షల డాలర్లను ఫిలిప్పీన్స్‌కు పంపినట్టు గుర్తించారు. ఈ నిధులు ఎవరికి పంపారు.. ఎందుకు పంపారన్న దానిపై పోలీసులు ఇపుడు ఆరా తీస్తున్నారు. 
 
కాగా, ఈ ఉన్మాదికి రియల్‌ ఎస్టేట్ వ్యాపారం, అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో భవనాలు, సొంతంగా రెండు విమానాలు, తుపాకులు ఉన్నాయి. ప్రతి రోజూ 30,000 డాలర్ల పందెంతో జూదం ఆడటం అలవాటు. ఇదీ పెడ్డాక్ లైఫ్ స్టైల్ ఇది. అలాంటి పెడ్డాక్ అంతమందిని ఉన్మాదిలా ఎందుకు కాల్చిచంపాడన్నదానిపై ఆరా తీస్తున్నారు. 
 
ఇంతలో పెడ్డాక్ మావాడే అన్న ఐఎస్ఐఎస్ ప్రకటన నేపథ్యంలో అతని వివరాలు మరింత జాగ్రత్తగా, నిశితంగా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెడ్డాక్ ఈ దాడిని పొరపాటున క్షణికావేశంలో చేసిన దాడిగా నిపుణులు భావించడం లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడని చెబుతున్నారు. హోటల్ గదికి 23 తుపాకులను పది సూట్ కేసుల్లో సర్దుకుని తీసుకెళ్లాడని గుర్తించారు. దీంతో ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన సామూహిక హత్యాకాండ అని వారు చెబుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పయ్యావుల కేశవ్‌కు కెసిఆర్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదేనట...

పరిటాల శ్రీరామ్ వివాహం కంటే ఆ వివాహానికి వచ్చిన పయ్యావుల కేశవ్, కెసిఆర్‌లు కలవడం మాత్రం ...

news

'We're all in 2017 while she's in 3017' : వాకిలిని ఇలా శుభ్రం చేయొచ్చు (Video)

సాధారణంగా ఇంటి వాకిలిని మహిళలు నడుం వంచి చీపురుతో శుభ్రం చేస్తుంటారు. అయితే, పెద్ద పెద్ద ...

news

ఆరునూరైనా పాదయాత్రకే జగన్ మొగ్గు.. అధికార పార్టీకి అస్త్రమేనా?

రాష్ట్రంలోని ప్రధానప్రతిపక్షమైన వైకాపా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ముందు ...

news

టిటిడి ఆలయంలో అస్థికలు బయటపడుతున్నాయి...

చిత్తూరు జిల్లా నాగలాపురంలోని వేద నారాయణస్వామి ఆలయంలో మట్టి తవ్వుతుంటే అస్థికలు ...

Widgets Magazine