సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:05 IST)

గొరిల్లాలా మారిన మహిళా పోలీసు..ఏమి చేసింది?

ఒక మహిళా పోలీసు గొరిల్లా వేషం వేసుకుని మూడురోజుల పాటు పార్క్‌లో పడిగాపులు కాసింది. మూడు రోజులైనా పార్క్‌లో ఉన్న వారెవరూ ఆమెను గుర్తుపట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆమె గొరిల్లాలా ఎందుకు మారిందో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. 
 
పశ్చిమ ఆస్ట్రేలియాలోని యాపిల్ క్రాస్ ప్రాంతంలో ఓ కామాంధుడు సంచరిస్తుండేవాడు. ఆ వ్యక్తి రోజుకొక అమ్మాయితో కనిపిస్తుండేవాడు. అమ్మాయిలను మాయమాటలతో మోసం చేసి అవసరం తీరాక వదిలివేయడం అతడి దినచర్యలో భాగమైంది. దాదాపు 47 సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తి సైకిల్‌పై రౌండ్స్ వేస్తూ అందంగా ఉండే వారిని మాటల్లో పెట్టేవాడు. అలా ఒకరోజు మహిళా పోలీసు కంటబడ్డాడు. 
 
కొన్ని రోజులు గమనించిన తర్వాత ఆమెకు అసలు విషయం అర్థమైంది. అతడు రోజుకో అమ్మాయితో తిరిగుతాడని, తొమ్మిది నెలలుగా వ్యవహారాలు నడుపుతున్న అతన్ని ఎలాగైనా సాక్ష్యాలతో పట్టుకోవాలనుకున్నది. పోలీస్ గెటప్‌లో వెళ్తే అతను జాగ్రత్తపడే అవకాశం ఉంది, కాబట్టి లేడీ పోలీస్ కాస్త గొరిల్లాగా మారింది. 
 
అతను ఎక్కువ సమయం గడిపే ప్రాంతాన్ని ఎంచుకుని, మరుసటిరోజు అతని కంటే ముందుగా గొరిల్లాగా వెళ్లి అక్కడే కాపుకాచింది. అలా మూడు రోజులు పాటు గొరిల్లాగా ఉన్నది. అయితే పార్క్‌లో ఉన్న వారు ఎవరూ ఆమెను కనిపెట్టలేకపోవడం విశేషం. మూడోరోజు పోలీస్ టీమ్‌కి సమాచారం అందించి అతన్ని సాక్ష్యాధారాలతో పట్టుకుంది. భవిష్యత్తులో అతని నుంచి ఎలాంటి ముప్పు రాకూడదనే ఉద్దేశంతో ఆమె పేరును వెల్లడించలేదని పోలీసులు పేర్కొన్నారు.