గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 5 మే 2018 (13:31 IST)

బద్ధలైన అగ్నిపర్వతం.. ఎగసిపడుతున్న లావా.. కుదేపిస్తున్న భూకంపం..

అమెరికా హవాయి ద్వీపంలోని అగ్నిపర్వతం బద్ధలైంది. దీంతో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.9‌గా నమోదైంది. ఈ తీవ్రతతో మరోసారి అగ్నిపర్వతం నుంచి లావా ఉబికి వస్తోంది. అంతేగాకుండా అత్

అమెరికా హవాయి ద్వీపంలోని అగ్నిపర్వతం బద్ధలైంది. దీంతో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.9‌గా నమోదైంది. ఈ తీవ్రతతో మరోసారి అగ్నిపర్వతం నుంచి లావా ఉబికి వస్తోంది. అంతేగాకుండా అత్యంత ప్రమాదకరంగా సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ వాయువు విడుదలవుతోంది.


దీంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా అగ్నిపర్వతం నుంచి మరింతగా లావా బయటకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా జియోలాజికల్‌ సర్వే హెచ్చరించింది. 
 
లావా ఎగసిపడి బయటకు ప్రవహించడంతో.. రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిపర్వతానికి సమీపంలోని లైలానీ ఎస్టేట్స్‌, లనిపునా గార్డెన్స్‌ ప్రాంతాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు. గురువారం నుంచి కిలౌయీ అగ్నిపర్వతం పెద్ద ఎత్తున పొగలు, లావా, బూడిద ఎగిసిపడుతున్నాయి.

శుక్రవారం అగ్నిపర్వతం సమీపంలో 5.3తీవ్రతతో భూకంపం సంభవించింది. మరో గంట తర్వాత 6.9 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. శనివారం కూడా భూకంప తీవ్రత అధికంగా వుందని.. భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారని అధికారులు తెలిపారు.