బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (13:44 IST)

లాస్ ‌ఏంజెలెస్‌ శివారుల్లో కార్చిచ్చు... అర్థరాత్రి రోడ్లపైకి పరుగులు తీసిన హాలీవుడ్ స్టార్లు

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ శివారు ప్రాంతాల్లో అంటుకున్న కార్చిచ్చు అమిత వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఆ ప్రాంతాల్లో నివశిస్తున్న హాలీవుడ్ స్టార్లు అర్థరాత్రి ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాస్ ఏంజెలెస్‌తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో ఆ ప్రాంతాల్లో ఉండే మిలియన్ డాలర్ల ఖరీదైన ఐదు భవనాలు బుగ్గైపోయాయి. 
 
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో నివాసం ఉండే పలువురు హాలీవుడ్ స్టార్లు అర్థరాత్రి సమయంలో తమ తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అలా వెళ్లిన వేలాది మందిలో కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ ష్వార్జనెగ్గర్ కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదకరమైన సమయంలో ఇక్కడే ఉండేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని, వెంటనే ఇళ్ల నుంచి బయటకు వచ్చేయాలని సూచించారు. మరోవైపు, ఇళ్లను వీడేందుకు ఒప్పుకోని వారిని అధికారులు బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు.