గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 డిశెంబరు 2021 (14:12 IST)

ఉగ్రవాదుల పైశాచిక క్రీడ: బస్సులో 32 మంది ప్రయాణికులకు నిప్పు, సజీవ దహనం

ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. పశ్చిమ ఆఫ్రికాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పైన విరుచుకపడ్డారు. ఆపై ప్రయాణికులు బస్సులో వుండగానే పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసి రాక్షసానందం పొందారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

 
పూర్తి వివరాలను చూస్తే... సోంగో గ్రామానికి చెందిన గ్రామస్తులు బస్సులో మార్కెట్టుకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉగ్రవాదులు బస్సుకు అడ్డు తగిలారు. డ్రైవరును బస్సు నుంచి దింపి తుపాకీతో కాల్చి చంపారు.

 
ఆ తర్వాత బస్సు టైర్లలో గాలి తీసేసారు. బస్సుపై పెట్రోలు పోయడం మొదలుపెట్టారు. దీనితో లోపలున్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నా పట్టించుకోకుండా నిప్పు పెట్టి సజీవంగా దగ్ధం చేసారు. ఈ దారుణ ఘటనలో 32 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడులకు పాల్పడింది అల్ ఖైదా ఉగ్రవాదులని చెపుతున్నారు.