గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (12:15 IST)

38 దేశాలకు పాకిన ఓమిక్రాన్.. భారత్‌లో అప్రమత్త చర్యలు

ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ దేశాలు ఒమిక్రాన్‌తో అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఈ వైరస్ 38 దేశాలకు పాకింది.

ఇజ్రాయేల్, బ్రిటన్, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ సహా పలుదేశాలు మాస్కుల వంటి నిబంధనలను కట్టుదిట్టం చేశాయి. 
 
అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. భారత్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన మొదలైంది. ఒక్కోరాష్ట్రం అప్రమత్తం అవుతోంది. విదేశీ ప్రయాణీకులను గుర్తించి... పరీక్షలు జరుపుతోంది.  
 
భారత్‌లో పలువురు వైద్య నిపుణులు ఈ వేరియంట్ ఉత్పరివర్తనాలపై హెచ్చరికలు చేశారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ అని భావిస్తున్న ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రోటీన్‌లో 30కి పైగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు చెప్తున్నారు.