మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జులై 2018 (15:39 IST)

ర్యాంప్ వాక్ చేస్తూ.. ఐదు నెలల బిడ్డకు పాలిచ్చిన మార్టిన్.. భేష్ అంటూ..?

మోడల్ మారా మార్టిన్.. మోడల్ ప్రపంచానికి ఓ వినూత్న సందేశాన్నిచ్చింది. ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలోనే తన ఐదు నెలల బిడ్డకు పాలిచ్చింది. అమెరికాకు చెందిన మార్టిన్ అనే మోడల్ స్లిమ్ షూట్ ప్రచార కార్యక్రమంల

మోడల్ మారా మార్టిన్.. మోడల్ ప్రపంచానికి ఓ వినూత్న సందేశాన్నిచ్చింది. ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలోనే తన ఐదు నెలల బిడ్డకు పాలిచ్చింది. అమెరికాకు చెందిన మార్టిన్ అనే మోడల్ స్లిమ్ షూట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మియామీలో నిర్వహించిన ఓ ర్యాంప్ షోలో పాల్గొంది. మోడల్‌ కంటే ముందు మార్టినా ఓ బిడ్డకు తల్లి. ర్యాంప్ వాక్ చేస్తుండగా మార్టినా ఐదు నెలల చిన్నారి ఏడుపు ప్రారంభించింది. 
 
మోడల్ అయినా తల్లి కావడంతో బిడ్డ ఎందుకు ఏడుస్తోందో మార్టినాకు వెంటనే అర్థమైంది. ర్యాంప్‌వాక్ నుంచి బయటకు వచ్చి తన చిన్నారి ఆకలి తీర్చాలనుకుంది. కానీ షో నిర్వాహకులు బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్‌ వాక్‌ చేయమని సలహా ఇచ్చారు. దాంతో మార్టినా బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్‌ వాక్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు మార్టినా. మార్టినా షేర్‌ చేసిన ఈ ఫోటోకు అనూహ్యంగా.. పెద్ద ఎత్తున జనాలు మార్టినాకు అభినందనలు తెలుపుతున్నారు. 
 
బిడ్డతో కలిసి ర్యాంప్ వాక్ చేసినందుకు ఈ స్థాయిలో స్పందన వస్తుందని తాను ఊహించలేదని మారా చెప్పింది. తాను అలా నడవాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నానని, తద్వారా తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలన్నదే తన ఉద్దేశమని మారా తెలిపింది. ఈ చర్యపై కొందరు నెటిజన్లు విమర్శిస్తే.. మరికొందరు భేష్ అంటూ కితాబిస్తున్నారు.