ఆహారం ఇచ్చేందుకు వెళ్తే.. మహిళా-జూకీపర్‌పై పెద్దపులి పంజా విసిరింది.. (ఫోటో)

సోమవారం, 6 నవంబరు 2017 (14:57 IST)

రష్యాలోని ఓ జూలో పులికి ఆహారం ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళపై సైబరియన్ పులి దాడి చేసింది. జూలో పనిచేసే మహిళా జూ-కీపర్ పులికి ఆహారం ఇవ్వజూపింది. అంతలోనే ఆకలి మీదున్న పెద్దపులి ఆమెపైనే పంజావిసిరింది. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని కలిన్‌ఇన్‌గ్రాడో జూలో మహిళా జూ కీపర్.. సైబరియన్ పులికి ఆహారం ఇచ్చేందుకు వెళ్లగా.. ఉన్నట్టుండి ఆ పులి ఆమెపై పంజా విసిరి దాడి చేసింది. 
 
ఎవరూ లేని చోటికి లాక్కెళ్లింది. దీన్ని చూసిన పర్యాటకులు పులి బారి నుండి మహిళను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చేతికందిన వస్తువులతో దానిపై దాడి చేశారు. దీంతో ఆ పులి మహిళను వదిలి దూరంగా పారిపోయింది. ఆపై జూ-కీపర్లు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళా జూ-కీపర్ తీవ్ర గాయాల పాలైందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.దీనిపై మరింత చదవండి :  
Tiger Female Guardian Zookeeper Russian Zoo Kaliningrad Zoo Siberian Tiger

Loading comments ...

తెలుగు వార్తలు

news

దటీజ్ మోడీ... కరుణతో భేటీ... తమిళనాట రాజుకున్న రాజకీయ సెగ

"రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు... శాశ్వత మిత్రులు లేరు" అన్నది నానుడి. దీన్ని ...

news

భారత్ అంటే రాజకీయ నేతలే కాదు.. : మీడియాకు ప్రధాని క్లాస్

దేశీయ మీడియాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లాస్ తీసుకున్నారు. భారత్ అంటే కేవలం రాజకీయ ...

news

రూ.25వేలిచ్చి ప్రియురాలిని సొంతం చేసుకున్నాడు.. భర్త కూడా ఓకే చెప్పాడు.. ఎక్కడ?

పెళ్లికి ముందే ప్రేమలో వున్న ఓ యువతిని మేనమామకిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయితే ...

news

'గాంధీ దేశంలో గజానికొక గాంధారి కొడుకు'.. వైఎస్ జగన్

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచకపాలనకు ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే తాను ...