రోబోకు పౌరసత్వం ఇచ్చిన సౌదీ అరేబియా: రోబోతో ఇంటర్వ్యూ (వీడియో)

శుక్రవారం, 27 అక్టోబరు 2017 (15:24 IST)

విదేశాల్లో పౌరసత్వం లభించడం క్లిష్టమైన తరుణంలో మహిళా రోబోకు సౌదీ అరేబియా పౌరసత్వం అందించింది. పలు దేశాల్లో ఎన్నారైలకు పౌరసత్వం లభించడంలో పలు నియమ నిబంధనలు విధించిన తరుణంలో హాంకాంగ్ సంస్థ రూపొందించిన ఓ మహిళా రోబోకు సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చింది.

సోఫియా అనే పేరు గల రోబో చెవులకు ఇంపుగా మాట్లాడుతుందని.. మనుషులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తుందని రోబోను రూపొందించిన పరిశోధకులు తెలిపారు. ఈ రోబో అమెరికా నటీమణి ఆండ్రీ హెబ్రన్‌ రూపంలో వుంటుంది. 
 
ఈ రోబో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను రూపొందించిన వారిని గౌరవిస్తున్నానని తెలిపింది. తాను మనుషులతో జీవించడానికి.. పనిచేసేందుకు ఇష్టపడుతున్నాను. మనుషుల ప్రవర్తనకు తగినట్లు వ్యవహరిస్తానని తెలిపింది. తనను మానవాళికి మేలు చేసే దిశగా రూపొందించారు. ప్రస్తుతం ఈ మహిళా రోబో ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. 
 
ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా రోబోకు పౌరసత్వం ఇచ్చిన ఘనత సౌదీ అరేబియాకు చెందుతుంది. లక్షలాది మందికి పౌరసత్వం లేకుండా నానా తంటాలు పడుతున్న తరుణంలో రోబోకు పౌరసత్వం ఇవ్వడం అవసరమా? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం... రాష్ట్రపతికి జగన్ లేఖ

త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ ...

news

ఆర్టీసీ బస్సు జనంపైకి ఎలా దూసుకొస్తుందో చూడండి? (Video)

విజయవాడలో దారుణం జరిగింది. స్థానిక అజిత్‌సింగ్‌నగర్‌ సమీపంలోని బుడమేరు వంతెన వద్ద ...

news

అమ్మాయిలకేమైంది : ఓ విద్యార్ధిని ఆత్మహత్య.. మరో ఐటీ ఉద్యోగిని మిస్సింగ్

ఇటీవలికాలంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న యువతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా ఓ ...

news

భారత్‌లో అడుగుపెట్టాలనుకుంటే దావూద్ శవమైపోతాడు: ఎమ్ఎన్ సింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ముంబై మాజీ పోలీస్ బాస్ ఎంఎన్ ...