శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (17:18 IST)

నేపాల్‌లో కోవిడ్-19 వ్యాప్తికి భారతే కారణం.. ప్రధాని కేపీ ఓలీ విమర్శలు

Nepal PM
నేపాల్‌లో కోవిడ్-19 వ్యాప్తికి భారతే కారణమని ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ విమర్శలు గుప్పించారు. చైనా, ఇటలీలోని కరోనా వైరస్‌ కన్నా భారత్‌లోని వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. 
 
భారత్‌ నుంచి అక్రమ మార్గాల్లో వస్తున్న వారి ద్వారానే నేపాల్లో వైరస్‌ వ్యాపిస్తోంది. సరైన పరీక్షలు చేయకుండానే అధికారులు, పార్టీ నాయకులు వారిని అనుమతిస్తున్నారు. బయట నుంచి జనాలు వస్తుండటంతో కొవిడ్‌-19ను కట్టడి చేయడం కష్టమవుతోంది. ఇటలీ, చైనాతో పోలిస్తే భారత వైరస్‌ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఎక్కువ మందికి సోకుతోంది' అని ఓలీ ఆరోపించారు.
 
భారత్‌లోని లిపులేఖ్‌, కాలాపానీ, లింపియాధురాలు ప్రాంతాలు నేపాల్‌కు చెందినవేనని కేపీ శర్మ ఓలీ అన్నారు. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వీటిని భారత్‌ నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ మూడు ప్రాంతాలను తమ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ రూపొందించిన కొత్త పటాన్ని నేపాల్‌ మంత్రిమండలి ఆమోదించిన సంగతి తెలిసిందే.