సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2022 (17:27 IST)

రసాయన శాస్త్రంలో కూడా ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్!

chemistry nobel prize
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడెమీ ప్రకంటించింది. కరోలిన్ ఆర్ బెర్టోజ్, మార్టిన్ మెల్డల్, బ్యారీ షార్ప్‌లెస్‌లు ఈ యేడాది కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 
 
క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీ విశేష పరిశోధనలు చేసినందుకుగాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. షార్ప్‌లెస్, మెల్డల్‌లు తొలుత క్లిక్ కెమెస్ట్రీ జీవం పోయగా, బెర్టోజిల్ దానిని దైనందిన జీవితంలో వినియోగపడేలా అభివృద్ధి చేశారు. 
 
ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ప్రకటించగా తాజాగా రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిపై ప్రకటన వచ్చింది. భౌతిక శాస్త్రంలో మాదిరే రసాయన శాస్త్రంలోనూ ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ యేడాది నోబెల్ బహుమతిని సమానంగా పంచుకోనున్న సంగతి తెల్సిందే. ఇక శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే నోబల్ శాంతి బహుమతిని ప్రకటన వెలువడింది.