Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉత్తర కొరియాలో 'ఘోస్ట్‌ డిసీజ్‌'.. పారిపోతున్న సైనికులు

సోమవారం, 4 డిశెంబరు 2017 (17:49 IST)

Widgets Magazine
Missile tests

ఉత్తరకొరియాలో అంతుచిక్కని వ్యాధి ఒకటి విజృంభిస్తోంది. దీంతో ఆ దేశ సైనికులతో పాటు ప్రజలు ప్రాణబీతితో వణికిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా వరుస అణు పరీక్షలతో పాటు మిస్సైల్ టెస్టులను విజయవంతంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షల కారణంగా వెలువడిన రేడియేష‌న్ ప్రభావం కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడినట్టు సమాచారం. 
 
ఈ పరీక్షల కారణంగా అణు ధార్మికత మోతాదుకు మించి వెల్లడైంది. దీంతో అనేక మంది అనారోగ్యానికి గుర‌వుతున్నట్టు సమాచారం. దీనికి భయపడి ఇప్పటికే ఆ దేశ సైనికులు పదుల సంఖ్యలో దక్షిణ కొరియాలోకి పారిపోయిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. రేడియేషన్ కారణంగా ఆ సైనికులు చాలా బాధ‌ని అనుభ‌విస్తున్న‌ట్లు దక్షిణ కొరియా వైద్యులు పేర్కొన్నారు.
 
ఇదే అంశంపై సౌత్ కొరియాకు పారిపోయి వచ్చిన నార్త్ కొరియా సైనికుడు స్పందిస్తూ, అణు పరీక్షల వల్ల ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్యకు లెక్కేలేదని చెప్పాడు. రేడియేషన్‌ కారణంగా బాధపడే వారిని ‘ఘోస్ట్‌ డిసీజ్‌’ (దెయ్యం వ్యాధి)తో బాధపడుతున్నట్లు ఉత్తరకొరియాలో చెబుతున్నార‌ని వారు చెపుతున్నారు. 
 
అలాగే, అవయవలోపంతో జన్మించిన శిశువులను ఉత్త‌ర‌కొరియాలో చంపేస్తున్నారని తెలిపారు. కాగా, రేడియేషన్‌ కారణంగానే ఉత్తరకొరియాలో మరణాలు సంభవిస్తున్నాయన్నడానికి త‌మ‌కు ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన ఆధారాలు దొర‌క‌లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డిశెంబరు 7న ఉత్తరాంధ్రకు తుఫాన్... రాజమౌళి హెచ్చరిక

ఉత్తరాంధ్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎంవో అదనపు కార్యదర్శి రాజమౌళి, వ్యవసాయ ...

news

చంద్రబాబు ఏంటిది? ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తున్నా... ఎవరు?

కాపులను బిసీల్లో చేరుస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై బిసి సంఘాలు ఆగ్రహంతో ...

news

చాక్లెట్ తీసిస్తామని బాలికను బాత్రూమ్‌కు తీసుకెళ్లి..?

కొల్‌కతాలో నాలుగేళ్ల బాలికపై కామాంధులు విరుచుకుపడ్డాడు. చాక్లెట్ తీసిస్తానని చెప్పి ...

news

రాహుల్ నుదుట వీర తిలకం దిద్దిన ప్రణబ్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీకి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ...

Widgets Magazine