గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 18 నవంబరు 2017 (16:36 IST)

ఉత్తర కొరియా సైనికుడి అవయవాల్లో పురుగులు.. 27 సెం.మీటర్ల పొడవుతో?

సైనికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. తీసుకునే ఆహారంలో పోషకాలుండేలా చూసుకుంటారు. కానీ ఉత్తర కొరియాకు చెందిన ఓ సైనికుడు మాత్రం వైద్యానికి చిక్కని బాధలను అనుభవిస్తున్నాడు. ఉత్తరకొరియా నుంచి దక్షిణ క

సైనికులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. తీసుకునే ఆహారంలో పోషకాలుండేలా చూసుకుంటారు. కానీ ఉత్తర కొరియాకు చెందిన ఓ సైనికుడు మాత్రం వైద్యానికి చిక్కని బాధలను అనుభవిస్తున్నాడు. ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాలోకి చొరబడుతున్న ఓ సైనికుడిపై.. అదే దేశానికి చెందిన సైన్యమే విచక్షణారహితంగా  కాల్పులు జరిపింది. తీవ్రగాయాలపాలైన అతన్ని దక్షిణ కొరియా దళాలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. 
 
ఈ సందర్భంగా అతనికి శస్త్ర చికిత్స అందించిన వైద్యులు.. అతని శరీర పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఆ సైనికుడి శరీర అవయవాలన్నింటిలోనూ వేల సంఖ్యలో పురుగులు వున్నట్లు గుర్తించారు. అతని నుంచి ఎలాంటి ప్రయోజనం లేదనో లేకుంటే అదే తరహా ఇబ్బంది తమకు కలుగుతుందని ఉత్తర కొరియా సైన్యం అతనిపై విచక్షణా రహితం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సైనికుడు ప్రస్తుతం అపస్మారక స్థితిలోనే వున్నాడు. 
 
కానీ ఆక్సిజన్‌ను మెషీన్ ద్వారా అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి దారుణమైన కేసును డీల్‌ చేయలేదని సైనికుడికి శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అతని ఉదర భాగంలోని అవయవాల నుంచి 27సెం.మీ పొడవున్న పురుగును వెలికితీసినట్టు చెప్పారు.
 
ఉత్తరకొరియాలో ఇప్పటికీ ఆధునిక వైద్య పద్దతులు అందుబాటులో లేవు. ఫలితంగా చాలామంది అక్కడ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారన్న వాదన కూడా ఉంది. ఉత్తరకొరియాలో వైద్య సేవలు ఇంకా పురోగతి సాధించలేకపోయాయి. ఉత్తరకొరియాలో చాలామంది పారాసైట్స్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్టు దక్షిణ కొరియా వైద్య పరిశోధకులు గతంలో గుర్తించారు. ప్రస్తుతం ఉత్తర కొరియాకు చెందిన సైనికుడు కూడా అదే తరహా వ్యాధితో బాధపడి వుండొచ్చునని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.