బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2017 (12:15 IST)

ఉత్తర కొరియాతో యుద్ధం చేయక తప్పదు : అమెరికా మంత్రి

నిత్యం దుందుడుకు చర్యలతో అంతర్జాతీయ సమాజాన్ని రెచ్చగొడుతున్న ఉత్తర కొరియాను కట్టడి చేయాలంటే ఆ దేశంతో యుద్ధం చేయక తప్పదని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ అన్నారు.

నిత్యం దుందుడుకు చర్యలతో అంతర్జాతీయ సమాజాన్ని రెచ్చగొడుతున్న ఉత్తర కొరియాను కట్టడి చేయాలంటే ఆ దేశంతో యుద్ధం చేయక తప్పదని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ అన్నారు. ఇదే అంశంపై టిల్లర్సన్ ఉత్తర కొరియా నుంచి తొలి బాంబు పడేంత వరకూ తాము చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్‌ను అదుపులో పెట్టే ప్రయత్నాలు సాగిస్తామన్నారు. 
 
తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదేవిధమైన అభిప్రాయంతో ఉన్నారని, ఆయన స్వయంగా ఈ విషయాన్ని చెప్పారన్నారు. దౌత్యపరంగా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు సాగించాలని ట్రంప్ వెల్లడించారని, తొలి బాంబు వచ్చేంత వరకూ చర్చలకు అవకాశాలపై పరిశీలిస్తూనే ఉండాలని తెలిపారని అన్నారు. ఆ తర్వాత మాత్రం యుద్ధం మినహా మరో ఆలోచన ఉండబోదని తెలిపారు. 
 
మరోవైపు... హస్ట్‌లర్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు లారీ ఫ్లింట్ వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో ఇచ్చిన ప్రకటన ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. డోనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే సమాచారాన్ని అందించిన వారికి  10 మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటన ఇచ్చారు. ట్రంప్ నుంచి తాను కోట్లాది రూపాయలను కోరడం లేదని... కేవలం ఆయనను పదవి నుంచి తప్పించాలని మాత్రమే కోరుకుంటున్నానని ప్రకటనలో పేర్కొన్నారు.