Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"అచ్చే దిన్ కాదు.. ఆకలి భారతం"... 119 దేశాల్లో 100వ స్థానంలో భారత్‌

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:34 IST)

Widgets Magazine
hunger india

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. పైగా, అగ్రదేశాలతో పోటీపడుతుందనే అనే మాటలు చాలా కాలంగా వినిపిస్తున్నవి. కానీ అదేసమయంలో దేశంలో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) తాజాగా ప్రకటించిన ప్రపంచ ఆకలి సూచిలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచ ఆకలి సూచీలో పేర్కొన్న 119 దేశాల్లో భారత్‌ 100వ స్థానంలో ఉండటం ప్రతి ఒక్కరూ తలదించుకునేలా ఉంది. 
 
ముఖ్యంగా, ప్రపంచంలో పోషకాహార లేమితో బాధపడుతున్న పిల్లలు, సరైన బరువులేని పిల్లలు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారని ప్రపంచ ఆకలి సూచి నివేదిక పేర్కొంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 21 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడటంతో పాటు సరైన బరువు కూడా లేరని వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ ఆహార సూచిలో భారత్‌ స్కోరు 31..4గా ఉంది. ఈ స్కోరు 28.. 5కు చేరితే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.
 
ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 100వ స్థానంలో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా 29వ స్థానంలో ఉంది. నేపాల్ -72, మయన్మార్-77, ఇరాక్ -78, బంగ్లాదేశ్- 88, ఉత్తరకొరియా 93వ స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ 106వ స్థానంలో ఉండగా,ఆఫ్ఘానిస్థాన్ 107వ స్థానంలో ఉన్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయ్ అమిత్ షా ఆరోపణలవై విచారణ జరగాలి : ఆర్ఎస్ఎస్

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ ...

news

ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక... దినకరన్ మళ్ళీ పోటీ చేసేనా?

మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు డిసెంబరు 31వ తేదీలోగా చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నికను ...

news

బాణసంచా నిషేధం సరికాదు... రాందేవ్ : ఆన్‌లైన్‌లోనూ అమ్మకంపై నిషేధం

దేశ రాజధాని ప్రాంతంలో బాణసంచాపై నిషేధం విధించడంపై ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ ...

news

మారుతున్న రంగులు... కాషాయంలోకి అన్నాడీఎంకే బోర్డులు

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ చేతిలో కీలుబొమ్మలా ...

Widgets Magazine