శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రియురాలి ఎదుట కన్నబిడ్డపై అత్యాచారం చేసి కొట్టి చంపిన తండ్రి

తన ప్రియురాలి ఎదుట కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడైన తండ్రి. అంతేకాకుండా, కన్నబిడ్డను నగ్నంగా చేసిన ఓ గదిలో బంధించాడు. అతనిపై అత్యాచారం చేస్తూ, చావబాదుతూ చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో ఆ బిడ్డ దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం అమెరికాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒహాయో రాష్ట్రానికి చెందిన అల్ ముతాహాన్ మెక్లీన్ (32) అనే వ్యక్తి తన ప్రియురాలితో కలిసి పదేళ్ళ వయస్సున్న టకోడా కాలిన్స్ అనే తన కుమారుడిపట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులు 2015 నుంచి ఉన్నాయి. శారీరంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. నగ్నంగా ఓ గదిలో బంధించి అత్యాచారం చేయడంతోపాటు గొడ్డునుబాదినంటు బాదేవాడు. 
 
ఈ క్రమంలో 2019 డిసెంబర్‌ 13న టకోడా కాలిన్స్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే కొడుకు ప్రాణాలు కోల్పోయాడు అనే విషయాన్ని గ్రహించని అల్ ముతాహాన్ మెక్లీన్.. పోలీసులకు సమాచారం అందించాడు. తన కొడుకు ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉన్నాడంటూ పేర్కొన్నాడు. 
 
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడి శవానికి పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు అనేక సంచలన విషయాలను వెల్లడించారు. బాలుడిపై అత్యాచారం జరిగినట్టు చెప్పడంతోపాటు దెబ్బలతకు తట్టుకోలేకే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. 
 
దీంతో పోలీసులు అల్ ముతాహాన్ మెక్లీన్‌తో పాటు అతని ప్రియురాలు అమండా హింజ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. సాక్ష్యాధారాలను పరిశీలించి అల్ ముతాహాన్ మెక్లీన్‌‌, అమండా హింజ్‌ను దోషులుగా తేల్చింది. ఈ క్రమంలో అల్ ముతాహాన్ మెక్లీన్ కూడా తాను చేసిన తప్పును కోర్టులో ఒప్పుకున్నాడు. ఈ కేసులో మెక్లీన్‌కు 40 యేళ్లు, అతని ప్రియురాలికి 30 యేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.