Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్‌లో హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం ఉంది: హెచ్చరించిన ఇంటలిజెన్స్

శుక్రవారం, 12 మే 2017 (11:45 IST)

Widgets Magazine
Terror Suspects

పాకిస్థాన్ కేంద్రం పనిచేసే ఉగ్రవాద సంస్థలతో పొరుగు దేశాలైన భారత్, ఆప్ఘనిస్థాన్‌లతో పాటు అమెరికాకు కూడా ప్రమాదం పొంచివుందని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు భారత సరిహద్దుల్లో ఉగ్రవాదులు పొంచివున్నారని.. వీరు భారత్‌లోకి చొరబడితే మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ డైరక్టర్ డానియల్ కోట్స్ హెచ్చరించారు. 
 
ఇదే ఏడాది భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత జఠిలం కానున్నాయని.. ఇంకా హై-ప్రొఫైల్ టెర్రరిస్టు దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందని తద్వారా భారత్ అప్రమత్తంగా ఉండాలని అమెరికా నిఘా సంస్థ హెచ్చరించింది. 
 
గత ఏడాది జరిగిన పఠాన్ కోట్, యూరీ ఘటనలను గుర్తు చేసిన కోట్స్.. ఈ ఘటనలకు పాల్పడింది.. సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులేనని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల వల్ల భారత్-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయన్నారు. తమ దేశంలోని ఉగ్ర మూలాలను ఏరిపారేయడంలో పాకిస్థాన్ తీవ్రంగా విఫలమవుతోందని.. తద్వారా ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత్‌లో విధ్వంసానికి పాక్ ఉగ్రసంస్థల కుట్ర : అమెరికా హెచ్చరిక

భారత్‌లో పేలుళ్ళతో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్ర సంస్థలు కుట్రపన్నాయని అమెరికా ...

news

డొనాల్డ్ ట్రంప్‌పై కుజ గ్రహ ప్రభావం.. మూడో ప్రపంచ యుద్ధం ఖాయమా?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. అమెరికాకు ...

news

అత్యాచారం కేసులో నిందితుడైన తెరాస ఎమ్మెల్సీ కుమారుడు ఎక్కడ?

అత్యాచారం కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ కుమారుడి ఆచూకీని హైదరాబాద్ నగర పోలీసులు ఇంతవరకు ...

news

కొడనాడు ఎస్టేట్‌లో హత్యలు.. దోపిడీలు.. 20 సీసీ కెమెరాలు, చెక్ పోస్టుల ఏర్పాటు.. 

కొడనాడు వేసవి విడిది కేంద్రానికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దివంగత ముఖ్యమంత్రి ...

Widgets Magazine