Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోదరుడి అక్రమ సంబంధం: చెల్లెల్ని నగ్నంగా గంట పాటు ఊరేగించారు

బుధవారం, 8 నవంబరు 2017 (11:14 IST)

Widgets Magazine

పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.  కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఈ పంచాయతి వ్యవస్థే కొనసాగుతోంది. ఏది కూడా పోలీస్ స్టేషన్ దాకా రాకుండా పంచాయతీలోనే తీర్మానం చేస్తుంటారు. అలాంటి తీర్మానమే ఇది. గ్రామ పంచాయతీలు చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయని ఎన్జీవోలు ఫైర్ అవుతున్నారు. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే..? సోదరుడు చేసిన తప్పుకు అతడి సోదరిని నగ్నంగా ఊరేగించారు. సోదరుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. అతడి చెల్లెల్ని నగ్నంగా ఊరేగించారు. ఈ మూర్ఖపు తీర్పుతో ఆ యువతి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
బాధిత బాలిక సోదరుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన మహిళ బంధువులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. యువకుడి 14 ఏళ్ల సోదరిని ఊరంతా నగ్నంగా ఊరేగించాలని పంచాయతిలో శిక్ష విధించారు. బాలికకు స్నానం చేయించిన గ్రామస్తులు ఆమె దుస్తులను బలవంతంగా విప్పించి గంటపాటు ఊరంతా ఊరేగించారు. ఈ దుర్ఘటన అక్టోబరు 27న జరిగినా లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

థియేటర్‌లో టాయి‌లెట్‌కెళ్లిన మహిళ.. చేయిపట్టిన లాగిన కార్మికుడు...

నిన్నటికినిన్న నెల్లూరులోని సినిమా థియేటర్‌లోని టాయ్‌లెట్‌కు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ...

news

పూర్వ జన్మలో భార్యవని.. షికార్లకు తీసుకెళ్లి.. రేప్ చేసిన సాధువు.. ఎక్కడ?

మహిళలపై దొంగ బాబాల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ సాధువు భక్తి ...

news

తీవ్రవాదుల చేతికి ఎం4 కార్బైన్ ఎలా వచ్చింది.. పాకిస్థాన్‌ను ప్రశ్నించిన ఇండియన్ ఆర్మీ

పాకిస్థాన్‌పై భారత ఆర్మీ నిప్పులు చెరిగింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి ...

news

హిమాచల్‌ప్రదేశ్ బ్యాలెట్ సమరం : పోలింగ్‌కు సర్వం సిద్ధం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రచారం ...

Widgets Magazine